16.10.2025
బ్రౌన్ గ్రంథాలయం వేదికగా గొప్ప సాహిత్య సేవలందిస్తాం
` ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్
ఉపకులపతి, యోగి వేమన విశ్వవిద్యాలయం
సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం వేదికగా తెలుగు భాషా సాహిత్యాలను మరింత విస్తృతపరుస్తూ ఆ దిశగా గొప్ప సాహిత్య సేవలందిస్తామని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా బెల్లంకొండ రాజశేఖర్ సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. బ్రౌన్ గ్రంథాలయం వెనుక నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణాలను పరిశీలించారు. నూతన భవనాన్ని త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. బ్రౌన్ నివాసమున్న బంగళా, సమాధి చిత్రాలను పరిశీలించి బ్రౌన్ సాహితీ సేవలను, గ్రంథాలయ నిర్మాణానికి ఎవరెవరు ఎంత కృషిచేశారన్న అంశాలను తెలుసుకున్నారు. భాషా పరిశోధన కేంద్రంలో ఉన్న పుస్తకాలను, తాళపత్రగ్రంథాలను, హ్యాండ్‌మేడ్ పేపర్స్, తామ్రపత్రాన్ని, సిద్ధాంత గ్రంథాలను, బ్రౌన్ రచనలను పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణ, విధివిధానాలను తెలుసుకొని సాహిత్యపరంగా బ్రౌన్ కేంద్రాన్ని మరింత ఉన్నతికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యో.వే.వి.కులసచివులు ఆచార్య పి.పద్మ, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది, కాంట్రాక్టర్ మోహన్‌రెడ్డి, నాగరాజు, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, సంచాలకులు ఆచార్య జి.పార్వతి, సహాయపరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి, డా.భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు ఎన్.రమశ్‌రావు, జి.హరిభూషణరావు, జూరియర్ అసిస్టెంట్ ఆర్. వెంకటరమణ, సిబ్బంది, కొత్తపల్లి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
డా.పి.సరిత
సంచాలకులు, ప్రజా సంబంధాలు