12.09.2025
బ్రౌన్ గ్రంథాలయానికి
ఎస్.ఆర్.ప్రతాప్ రెడ్డి పుస్తకాల బహూకరణ
దువ్వూరు మండలం చల్లబసాయపల్లెలోని ‘గ్రామీణ ప్రజా చైతన్య గ్రంథాలయం’ వ్యవస్థాపకులు ఎస్.ఆర్.ప్రతాప్‌రెడ్డి సుమారు 200 పుస్తకాలను శుక్రవారం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు ఎన్. రమేశ్ రావు, సిబ్బందిలకు అందజేశారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ వారు బహూకరించిన గ్రంథాల్లో ‘అమ్మమ్మగారి ఊరు’, ‘కథ మరిచిన మనిషి’, ‘నల్లమల రత్నాలు’(నానీలు), ‘పల్లెలు నాడు నేడు’, ‘విజయరాఘవ శతకం’, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’, ‘సింహ గర్జన’, ‘దండెం’, ‘గోదావరి నానీలు’, ‘తొలకరి మెరుపులు’, ‘వజ్రాల బేహారి’, ‘మేలుకొలుపు’, జీవన దర్శనం’ లాంటి పలు విలువైన గ్రంథాలున్నాయన్నారు.
గ్రంథాలయానికి పుస్తకాలు బహూకరించిన ఎస్.ఆర్.ప్రతాప్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులను యోగి వేమన విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వైస్‌ఛాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ అభినందించారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా.భూతపురి గోపాలకృష్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణ్‌రావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, ఎం.మౌనిక, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.